కరోనాపై తన ఉగ్రవాదులకు సూచనలు చేస్తోన్న ఐసిస్

  • ప్రపంచాన్ని హడలెత్తించిన ఉగ్ర సంస్థగా ఐసిస్ కు గుర్తింపు
  • ఇప్పుడు కరోనాను చూసి భయపడుతున్న ఐసిస్
  • మాస్కులు ధరించాలని, కరోనా ప్రభావ దేశాలకు వెళ్లొద్దని సూచన
ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాద సంస్థగా పేరుగాంచిన ఐసిస్ సైతం కరోనా మహమ్మారి కారణంగా జాగ్రత్త పడుతోంది. కరోనా వైరస్ అనేక దేశాలకు పాకుతున్నందున తన ఉగ్రవాదులను అప్రమత్తం చేసింది. మాస్కులు ధరించడం వంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా కరోనా తీవ్రంగా ఉన్న దేశాలకు వెళ్లొద్దంటూ స్పష్టం చేసింది.  తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని, నిద్రలో లేచినా సరే చేతులు కడుక్కోవాలని ఐసిస్ సూచించింది. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి దూరంగా ఉండాలని, నిపుణుల సూచనలను నిర్లక్ష్యం చేయరాదని పేర్కొంది. ఈ మేరకు తమ అల్ నబా పత్రికలో ప్రచురించింది.

ISIS
Corona Virus
Terrorists
COVID-19

More Telugu News